పేపర్లను తప్పుగా అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేస్తే డీలర్లదే బాధ్యత..క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం: ఇలంబర్తి 

పేపర్లను తప్పుగా అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేస్తే డీలర్లదే బాధ్యత..క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం: ఇలంబర్తి 
  • నేటి నుంచి ఫిజికల్ పేపర్లు తీసుకునే విధానం రద్దు

హైదరాబాద్​సిటీ, వెలుగు: షోరూముల్లోనే వాహనాల రిజిస్ట్రేషన్​ కొనసాగుతున్న నేపథ్యంలో డీలర్లు పేపర్లను తప్పుగా అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేయవద్దని రవాణాశాఖ కమిషనర్​ఇలంబర్తి స్పష్టం చేశారు. ఒకవేళ ఆఫీసుకు తప్పుడు, నకిలీ పేపర్లను సమర్పిస్తే క్రిమినల్​చర్యలు తీసుకుంటామని డీలర్లను హెచ్చరించారు. గురువారం ఆయన వాహనాల పర్మినెంట్​రిజిస్ట్రేషన్​దరఖాస్తుల సమర్పణపై ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ‘ఈ ఏడాది జనవరి 24 నుంచి రవాణా శాఖలో అమలు చేస్తున్న డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్ విధానాన్ని  శుక్రవారం(ఈ నెల 13 నుంచి) రద్దు చేస్తున్నం’ అని చెప్పారు.

ఇకపై డీలర్లు, యజమాని, ఫైనాన్సియర్ (అవసరమైతే) సంతకాలతో కూడిన ఫారం–-20 , ఇతర పత్రాల స్కాన్ కాపీలను మాత్రమే ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేయాలన్నారు. 13వ తేదీకి ముందు టీఆర్​పొందిన వాహనాలకు కూడా డీలర్లు ఫామ్​–-20, ఇతర పత్రాల స్కాన్ కాపీలు అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేసి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ద్వారా శాశ్వత రిజిస్ట్రేషన్ పొందే అవకాశం కల్పించినట్టు తెలిపారు. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో అందిన దరఖాస్తులను ఆర్టీఏ అధికారులు రెండు పని దినాల్లోపే పరిశీలించి ఆమోదించాలని.. ఆలస్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీలర్లు తమ వద్ద 7 రోజులకు మించి దరఖాస్తులు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉంచకూడదన్నారు. ఈ మార్పులకు అనుగుణంగా డీలర్లు నడుచుకోవాలని సూచించారు. ‌‌‌‌‌‌